18 July, 2026 | 3:26 PM

ఫోర్త్ ఆల్ ఇండియా ఓపెన్ & జూనియర్స్ చెస్ ఛాంపియన్‌షిప్ క్రీడలు ప్రారంభం

18-07-2026 03:26 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని వి-కన్వెన్షన్‌లో 'జీనియస్ చెస్ అకాడమీ' ఆధ్వర్యంలో ఫోర్త్ ఆల్ ఇండియా ఓపెన్ & జూనియర్స్ చెస్ ఛాంపియన్‌షిప్ - 2026 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు ముఖ్య అతిథులుగా నగర మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి  యాదగిరి సునీల్ రావు హాజరై చదరంగ క్రీడలను ప్రారంభించారు. చిన్నారుల్లో మేధాశక్తిని, ఏకాగ్రతను పెంపొందించడానికి చదరంగం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

క్రీడాకారులు చెస్‌లో తమ అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి, భవిష్యత్తులో దేశానికి మంచిపేరు తేవాలని పిలుపునిచ్చారు.టోర్నమెంట్ నిర్వాహకులు కంకటి అనూప్ మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలను ప్రోత్సహించేందుకు వందకు పైగా బహుమతులతో పాటు, మొత్తం రూ. 1,25,000/- నగదు బహుమతులను అందజేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కె. ఏపీపీ చంద్ర, పలు క్రీడా సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.