calender_icon.png 9 November, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు అఖిలభారత యాదవ మహాసభ మద్దతు

09-11-2025 12:34:23 AM

ముషీరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని అఖిలభారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్రనాథ్ యాదవ్,

జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేకల రాజేందర్ యాదవ్ లు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో సుమారు 32 వేల ఓట్లు ఉన్నాయని,  కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని వారు తెలిపారు. విద్యావంతుడు, ప్రజల మనిషి నవీన్ యాదవ్‌ను  గెలిపించుకోవాల్సిన బాధ్యత యాదవులపై ఉన్నదని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో మహాసభ కోశాధికారి ధారబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శిలు రాగం నాగేందర్ యాదవ్,  గండి జగన్ యాదవ్,  జాతీయ కార్యవర్గ సభ్యులు సిపిరి కిరణ్ యాదవ్, బత్తుల ప్రశాంతి యాదవ్,  రాష్ట్ర యువజన అధ్యక్షుడు గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్, యేషాం మనిష్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ యోజన అధ్యక్షుడు ఎం. విజయ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.