06-05-2025 12:00:00 AM
ఎంపీ అనిల్ కుమార్ యాదవ్..
ముషీరాబాద్, మే 5 (విజయక్రాంతి) ముషీరాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన ఎంపీ నిధులలో అత్యధికంగా ముషీరాబాద్ నియోజక వర్గానికే కేటాయిస్తానని ఎంపీ అనిల్‌కుమా ర్‌యాదవ్ అన్నారు. సోమవారం భోలక్ పూర్ డివిజన్లోని సిద్ధిక్‌నగర్, సందాని వీధి లో దశాబ్దా కాలంగా నెలకొన్న డ్రైనేజీ సమ స్య పరిష్కారానికి ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ తన నిధుల నుంచి రూ.10.50 లక్షలు మంజూరు చేయడంతో ఆయనను అభినందిస్తూ సయ్యద్ మసూద్ ఆధ్వర్యంలో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో అద్వా న స్థితికి చేరుకున్న మంచినీరు, డ్రైనేజీ పైప్‌లైన్లను ప్రణాళిక బద్దంగా మార్చుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎంపీ నిధులు కేటాయిస్తున్నామన్నారు.
భోలక్‌పూర్‌లో అత్యధికంగా మురికివాడ ప్రాంతాలు ఉన్నందున్న ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రె స్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ యాదవ్, భోలక్‌పూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జపీర్ ఉద్దీన్, నాయకులు ఉస్మాన్, అబ్దుల్‌ఖరీం, వాహేద్, ముజిద్, ఖైరత్ అలిబాబా తదితరులున్నారు.