12-05-2025 02:42:32 PM
హైదరాబాద్: తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఖమ్మం జిల్లాలో సోమవారం పర్యటించారు. మున్నేరు రిటర్నింగ్ వాల్ పనులను మంత్రి పరిశీలించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పెద్దలు ధనిక రాష్ట్రం అంటూ ప్రజలను మోసం చేశారని మంత్రి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న ఈ విషయమే చెప్తారని తెలిపారు. పేదలకు న్యాయం చేసేది ముమ్మాటికి ఇందిరమ్మ ప్రభుత్వమేనని పొంగులేటి పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాల్( Munneru retaining wall works) పనులను త్వరగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.