calender_icon.png 12 May, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐ హబ్‌గా హైదరాబాద్‌: సీఎం రేవంత్‌

12-05-2025 02:31:37 PM

  1. సొనాటా సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం. 
  2. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగ కల్పనలో మేము నెంబర్‌ వన్‌. 
  3. డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తున్నాం.. 
  4. ఏపీలో సీపోర్ట్‌ అనుసంధానం చేస్తున్నాం: రేవంత్‌

హైదరాబాద్: నానక్‌రామ్‌గూడలో సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ సెంటర్(Sonata Software New Facility)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.... ఏఏ(Artificial intelligence)ఐతో పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణమని పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ జీసీసీ హబ్ గా మారిందని చెప్పారు. ఏఐ-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా మారిందని సీఎం తెలిపారు. కొత్తగా రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షకుపైగా ఉద్యోగాలు సృష్టించామని రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెల్లడించారు. మరిన్ని ప్రపంచస్థాయి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతున్నాయని సీఎం తెలిపారు. ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో అందరి సహాకారం కోరుతున్నామన్నారు.