12-05-2025 02:46:38 PM
ప్రైవేట్ పాఠశాలలకు తొత్తుగా వ్యవహరిస్తున్న ఎంఈఓ ను సస్పెండ్ చేయాలి.
ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాంపెళ్లి రోహిత్.
హుజురాబాద్,విజయక్రాంతి: హుజురాబాద్ పట్టణ కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలు విద్యా వ్యాపారం చేస్తున్నాయని, అక్షరాలతో లక్షల రూపాయలు చేస్తూ ఇష్టానుసారంగా ప్రకటన లు ప్రచారం చేస్తున్న విద్యాశాఖ పట్టించుకోవడంలేదని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడి అరికట్టకుండ వారికి వత్తాను పలుకుతూ వారు చేస్తున్న విద్యా వ్యాపారానికి సహకరిస్తున్న మండల విద్యాశాఖఅధికారిని సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్(All India Students' Federation) మండల కార్యదర్శి రాంపెళ్లి రోహిత్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో సోమవారం ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు(Private corporate schools) ఫీజుల పేరిట విద్య వ్యాపారం చేస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని డీఈఓ ఎంఈఓల అండదండలతోనే ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం ఇష్టానుసారంగా ఫీజుల వసూలు చేస్తున్నారని అన్నారు. అడ్మిషన్ ఫీజు స్కూల్ ఫీ. యూనిఫామ్ ఫీ పుస్తకాలు స్టేషనరీ పేరట లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడ కూడా విద్యాశాఖ నిబందలు పాటించడం లేదని మౌలిక వసతులు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయని నిబంధనలు విరుద్ధంగా తోక పేర్లు అయిన ఇంటర్నేషనల్, వరల్డ్, ఈ టెక్నో,టెక్నో కరికులం అంటూ ప్రచారం చేస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా రెగ్యులేశన్ కమిటీ ఏర్పాటు చేసి ఫీజుల దోపిడి అరికట్టాలని పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులకు, సిబ్బందికి సరైన జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖాధికారి వారికి అన్ని విధాలా సహకరిస్తున్నారని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఎజెంట్ ల వ్యవహరిస్తున్న డీఈఓను సస్పెండ్ చేసి కలెక్టర్ జిల్లాలో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రోహిత్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు రాధకృష్ణ, శివ, మహేష్, అరుణ్, కౌశిక్, తదితరులు పాల్గొన్నారు.