calender_icon.png 12 May, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతితో భూసమస్యలు పరిష్కారం

06-05-2025 12:00:00 AM

  1. సందేహాలను నివృత్తి చేయడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యం 
  2. భూభారతి రెవెన్యూ సదస్సులను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలి
  3. కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్, మే 5 (విజయక్రాంతి): భూసమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రవే శపెట్టిన భూభారతి చట్టాన్ని అమలు చేస్తూ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కుంటాల మండలంలోని ఓల గ్రామంలో సోమవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నా రు. రైతులతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలపై వివరాలు సేకరించారు.

ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించడం, వారి సందేహాల నివృత్తి చేయడమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. భూమిపై పూర్తి హక్కులను కల్పించేందు కు ప్రభుత్వం చట్టాన్ని అమలు చేస్తోందన్నా రు. కుంటాల మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు.

ఈ సదస్సుల్లో భూ రికార్డులలో పేరు, విస్తీర్ణం లోపాలు, వారసత్వ భూములు, భూ స్వభా వం, నిషేధిత జాబితాలోని భూములు, సర్వే నంబర్ల లోపాలు, పట్టా పాస్ బుక్కుల లేని భూములు, సాదాబైనామాలు, హద్దుల సమస్యలు, పార్ట్-బి భూములు, భూసేకరణ కేసులపై దరఖాస్తులు స్వీకరించి, భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్ ప్రకారం విచారణ జరిపి పరిష్కరిస్తామని వివరించారు.

వివిధ కారణాల వలన రెవెన్యూ సదస్సుల్లో దరఖా స్తులు సమర్పించలేని వారు తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకునే సదుపాయం ఉందని తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో ప్రింట్ చేసిన ప్రొఫార్మాల ఆధారంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, క్షేత్రస్థాయి విచా రణకు వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని సూచించారు.

రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. ప్రజ లు సమర్పించిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి, తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు ఆదేశించారు. ఈ సదస్సులో అదనపు కలెక్టర్ కిషోర్‌కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, తహసీల్దార్ కమల్ సింగ్, తహసీల్దార్ ప్రత్యేక అధికారులు ఏజాజ్ అహ్మద్, ప్రవీణ్ కుమార్, ప్రజలు పాల్గొన్నారు.