రైతులకు అందుబాటులో అన్ని రకాల విత్తనాలు
నల్లగొండ టౌన్, మే 29: రైతులకు సీజన్లో అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ లిమిటెడ్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జిల్లాలోని రైతాంగము జనుము విత్తనములను వినియోగించుకొని వివిధ రకాల పంటను ఉత్పత్తిని పెంచుకోవాలని కోరినారు. జిల్లాలో అనేక చోట్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావచ్చిందని తెలిపారు. నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ లిమిటెడ్ బిజినెస్ మేనేజర్ నాగిళ్ల మురళి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్న ఎన్ డిసిఎంఎస్ ప్రస్తుతం రూ.4 కోట్ల లాభాలలో ఉందని తెలిపారు. మారుమూల గ్రామాలలో కూడా యూరియా అందించడంలో ముందంజలో ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా సహకార అధికారి ఏవో శ్రీనివాసులు, పంచాయతీ సెక్రెటరీల సంఘం అధ్యక్షుడు అధ్యక్షుడు కాశీం,కార్యవర్గ సభ్యులు,రైతులు పాల్గొన్నారు.






