30 May, 2026 | 1:27 AM

ఏరియా పర్సనల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన తిరుపతి

30-05-2026 12:51 AM

శుభాకాంక్షలు తెలియజేసిన ఐఎన్టీయూసీ నేత తీగల క్రాంతి కుమార్

సత్తుపల్లి. మే. 29.( విజయ క్రాంతి ): సత్తుపల్లి ఏరియాలో జి.ఎం కార్యాలయంలో ఏరియా ఉద్యోగుల పలు సమస్యల పరిష్కారానికి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సత్తుపల్లి   కొత్తగూడెం ఏరియా పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏరియా ఐఎన్టీయూసీ నేత తీగల క్రాంతికుమార్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువా పూల బొకేతో సన్మానించారు.

అనంతరం క్రాంతి కుమార్ మాట్లాడుతూ కార్మికులకు రావలసిన ప్రమోషన్స్  ఇంక్రిమెంట్స్ సకాలంలో ఇచ్చే విధంగా చూడాలని కోరారు. కార్మికుల సంక్షేమం సమస్యల పరిష్కారం సంస్థ అభివృద్ధికి పరస్పర సహకారం అందే విధంగా చూడాలని  యాజమాన్యం మరియు కార్మికుల సత్సంబంధాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఏరియా పర్సనల్ మేనేజర్ తిరుపతి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని కార్మికులకు న్యాయం చేసేలా సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎస్.ఓ.టు జి.ఎం బొల్లం శ్రీనివాస్  జే.వి.యర్ ఓసి ప్రా జెక్ట్ ఆఫీసర్ ప్రహ్లాద్  కిష్టారం ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ సునీల్ వర్మ  జే.వి.ఆర్ సి.హెచ్.పి డీ.జీ.ఎం సోమశేఖర్  సంక్షేమ అధికారి శ్రీనివాస్ ఇతర ఉన్నతాధికారులు ఐఎన్టీయూసీ ప్రతినిధులు పోగల నాగేశ్వరరావు  మోహన్ రషీద్  రాజేందర్ వెంకటేశ్వర్లు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.