నాలుగు డివిజన్లకు నిధులు ఇవ్వండి
జోనల్ కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే మాధవరం విజ్ఞప్తి
సికింద్రాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ప్రజలకు అందుబాటులో సేవలు అందేలా కార్యాలయాన్ని స్థానికంగానే కొనసాగించడం అవసరమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో పలు ప్రజా సమస్యల పై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఓల్డ్ బోయిన్ పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ బుధవారం జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ను కలిసి చర్చించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గం లోని ఓల్ బోయినపల్లి, హస్మత్ పేట, ఫతేనగర్, బేగంపేట నాలుగు డివిజన్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా నిధులు ఇవ్వలేదని ఓల్ బోయినపల్లి, హస్మత్ పేట, ఫతేనగర్, బేగంపేట డివిజన్లకు నిధులు మంజూరు కాకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. బోయిన్ పల్లి సర్కిల్-3 కార్యాలయం బోయిన్ పల్లిలోనీ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇర్ఫాన్, హరినాధ్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.






