జీవన్ రక్షక్ అవార్డు గ్రహీతగా డాక్టర్ పల్స హరీష్ గౌడ్
డాక్టర్స్ డే సందర్భంగా విశిష్ట సేవలకు గుర్తింపు
కామారెడ్డి, జూలై 1 (విజయక్రాంతి): జాతీయ వైద్యుల దినోత్సవం (డాక్టర్స్ డే) సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో బుధవారం ఘనంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ పల్స హరీష్ గౌడ్ కు ప్రతిష్ఠాత్మక జీవన్ రక్షక్ అవార్డు ప్రదానం చేశారు. మాజీ మంత్రి, సినీ నటుడు డాక్టర్ బాబు మోహన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
వైద్య రంగంలో ప్రజలకు అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి పీపుల్ మీడియా పాయింట్ సంస్థ ఈ అవార్డుకు డాక్టర్ హరీష్ గౌడ్ను ఎంపిక చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మొత్తం 50 మంది వైద్యులను ఈ అవార్డుకు ఎంపిక చేయగా, వారిలో తనకు చోటు దక్కడం ఎంతో గర్వంగా ఉందని డాక్టర్ హరీష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి వైద్యులు ఆయనకు అభినందనలు తెలిపారు.






