2 July, 2026 | 2:01 AM

కేర్ హాస్పిటల్స్‌లో వైద్యులకు సన్మానం

02-07-2026 12:55 AM

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నెట్వర్క్ అయిన కేర్ హాస్పిటల్స్ తన ఆస్పత్రులన్నింటిలో వైద్యులను ఘనంగా సత్కరించింది. ఈ ఏడాది జాతీయ వైద్యుల దినోత్సవం థీమ్ ‘మాస్క్ వెనుక... వైద్యులకు అండగా నిలిచేది ఎవరు?‘ వైద్యుల శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై దృష్టి సారిస్తోంది. అత్యాధునిక వైద్య సాంకేతికతతో పాటు వైద్యుల సంక్షేమం, నిరంతర శిక్షణ, పరిశోధన, పరస్పర సహకారం, వృత్తిపరమైన అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించడానికే కేర్ హాస్పిటల్స్ కట్టుబడి ఉందని సంస్థ పేర్కొంది.

కేర్ హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. ‘ప్రతి రోగి తన వైద్యుడిపై అపారమైన నమ్మకంతో ఆస్పత్రికి వస్తాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి వైద్యుడి బాధ్యత. ప్రతి విజయవంతమైన చికిత్స, శస్త్రచికిత్స వెనుక వైద్యుల అంకితభావం, అనుభవం, సరైన నిర్ణయాలే ఉంటా యి’ అన్నారు. గత 29 సంవత్సరాలుగా కేర్ హాస్పిటల్స్ క్లినికల్ నైపుణ్యం, ఆధునిక సాంకేతికత, పరిశోధన, వైద్య విద్య, నాణ్యమైన వైద్య సేవల ద్వారా విశ్వసనీయ ఆరో గ్య సేవలను అందిస్తోంది. భవిష్యత్తులో వైద్యులను మరింత శక్తివంతం చేస్తూ, రోగి కేంద్రిత వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి సంస్థ కట్టుబడి ఉందన్నారు.