calender_icon.png 29 October, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాటరీ పద్ధతిన మద్యం షాపుల కేటాయింపు

28-10-2025 12:00:00 AM

67 మద్యం షాపులకు డ్రా తీసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

 హనుమకొండ, అక్టోబర్ 27( విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా పరిధిలోని  67 మద్యం షాపులకు లాటరీ డ్రా ను సోమవారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు. హన్మకొండ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించి లాటరీ డ్రాను తీసేందుకు ఏర్పాట్లు చేయగా హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ హాజరై డ్రా తీశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 67 మద్యం షాపులకు 3175 దరఖాస్తులు రాగా  లాటరీ పద్ధతిన  డ్రాను తీశారు.

ఒక్కో మద్యం దుకాణానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సమక్షంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ డ్రా తీసి సంబంధిత నెంబర్ ను ప్రకటించారు. ఈసారి కొన్ని షాపులు కొత్త అభ్యర్థులకు రాగా, కడిపికొండ ప్రాంతానికి సంబంధించి 58 నంబర్ గల షాప్ కు అత్యధికంగా 116 అప్లికేషన్లు రాగా పాత షాపు వారికే  ప్రస్తుతం కూడా లాటరీ దక్కడం గమనార్హం.

మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించి లాటరీ పద్ధతిన డ్రా లో కేటాయించబడిన అభ్యర్థికి కేటాయింపు పత్రం ఎక్సైజ్ అధికారులు అందజేశారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఎక్సైజ్ శాఖ సిఐలు,ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజావాణి వినతులను త్వరగా పరిష్కరించాలి

హనుమకొండ టౌన్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై అందించిన వినతులను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్ట రేట్ లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా  అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్ర మాన్ని కలెక్టర్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు విన్న విస్తూ ప్రజావాణిలో కలెక్టర్, అదనపు కలెక్టర్ లకు వినతులను అందజేశారు.   ప్రజావాణి కార్యక్రమంలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజల నుండి 112 వినతులు వచ్చాయని అన్నారు.  డిఆర్వో వై.వి. గణేష్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.