28-10-2025 12:00:00 AM
రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్ ఠాకూర్
గోదావరిఖని, అక్టోబర్ 27(విజయక్రాంతి) విద్యార్థుల సౌకర్యార్థం ఆధునిక స దుపాయాలతో కూడిన జూనియర్ కళాశాల నిర్మాణం చేపడతామని రామగుండం ఎమ్మె ల్యే ఎం. ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. సోమవారం గోదావరిఖనిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం కోసం ప్రతిపాదిత స్థలా న్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, స్థాని క విద్యార్థుల సౌకర్యార్థం ఆధునిక సదుపాయాలతో కూడిన ప్రభుత్వ జూనియర్ కళా శాల త్వరితగతిన నిర్మాణం చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సింగరేణి అధికారులు, కాం గ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.