calender_icon.png 20 June, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

20-06-2025 01:16:50 AM

బాన్సువాడ జూన్ 19 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా గురువారం బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  అగ్రో  ఇండస్ట్రీస్ ఛైర్మెన్  కాసుల బాల్ రాజ్  ఆధ్వర్యంలో  రాహుల్  గాంధీ   జన్మదిన వేడుకలు జరపడం  జరిగింది.

ఈ సందర్భంగా కార్యకర్తలతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ  కార్యక్రమములో కామారెడ్డి  జిల్లా  మైనారిటీ  అధ్యక్షులు  ఖలేఖ్, కామారెడ్డి  జిల్లా  యువజన  అధ్యక్షులు  మధు సుధన్, బ్లాక్  కాంగ్రెస్  అధ్యక్షులు  అసద్ బిన్ మోసీన్, సొసైటీ  అధ్యక్షులు కృష్ణారెడ్డి, షాహబ్, నార్ల  సురేష్, ఎజాజ్ అంజిరెడ్డి రవీందర్ ,వాహబ్, షోయెబ్, మోహన్  నాయక్ తదితరులను  పాల్గొన్నారు. 

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ..

అర్మూర్, జూన్ 19 : (విజయ క్రాంతి) : ఆలూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువ నాయకులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా గురువారం గ్రామ కూడలిలో కేక్ కోసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది, ప్రజా క్షేత్రంలో, దేశ రాజకీయాల్లో, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాహుల్ గాంధీ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కెర విజయ్, మాజీ ఎంపీపీ పస్క నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి, దేగాం శ్రీనివాస్ గౌడ్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కళ్ళెం మల్లారెడ్డి, మండల సోషల్ మీడియా ఇంచార్జీ సంజీవ్, కిసాన్ సెల్ అధ్యక్షుడు బార్ల ముత్యం కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.