30 July, 2026 | 10:35 PM

నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్‌కు అనుమతి

29-05-2024 12:57 AM

ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి 

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి):  నిబంధనల మేరకే సోమ్ డిస్టలరీస్ కంపెనీకి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.  కొత్త మద్యం బ్రాండ్లపై తమకు ఎలాంటి దరఖాస్తు రాలేదని,  గతంలో  తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో హోల్ సేల్ మద్యం సరఫరా, కొత్త బ్రాండ్ల విక్రయాల  పక్రియ బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందని తెలిపారు . ఇప్పటికే ఉన్న ఎక్సైస్ పాలసీ ప్రకారమే సోమ్ కంపెనీకి అనుమతులు ఇచ్చారని తెలిపారు. 

ఎక్కడా కూడా నిబంధనలు ఉల్లంఘించలేదని మంత్రి స్పష్టం చేశారు.   మొత్తం ఐఎంఎఫ్‌ఎల్ బీర్ల తయారీ సప్లయన్ చైన్ 97.44 శాతం వదేశి కంపెనీలే ఆక్రమించాయని ఈ  సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.మన దేశానికి చెందిన సోమ్ డిస్టలరీకి మద్యం సరఫరాకు అనుమతులు ఇవ్వడాన్ని రాజకీయం చేస్తున్నారని తెలిపారు.దీన్ని కూడా బిఆర్‌ఎస్ నాయకులు రాజకీయం చేయడం విడ్దూరంగా ఉందని,ఇలాంటి అసంబద్దమైన, ,చెడు ప్రచారాలు చేయడం మానుకోవాలని, ఇలాంటి నిరాధార ఆరోపణలు ప్రచారం చేస్తూ  ప్రజల విలువైన సమయాన్ని వృథా చేయవద్దని సూచించారు.