7 April, 2026 | 1:01 PM

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

07-12-2024 11:50 PM

సీఎం కప్ 2024 క్రీడలను ప్రారంభించిన కలెక్టర్...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ రూరల్ మండలం చాంద (టి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ 2024 క్రీడలను శనివారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. యువత క్రీడల వైపు మొగ్గు చూపాలని, క్రీడల వలన శారీరక ఆరోగ్యంతో పాటు, మానసికంగా దృఢంగా ఉంటామన్నారు. సీఎం కప్-2024 క్రీడలలో ప్రతిభ కనబరచాలని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఆ దిశగా మండల, జిల్లా స్థాయిలో క్రీడాకారులకు వివిధ క్రీడా రంగాల్లో క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, జిల్లాలోని ప్రతి మండలానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారులు చైర్మన్ లుగా వ్యవహారించడం జరుగుతుందన్నారు. మండల స్థాయిలో డిసెంబర్ 10 నుండి 12 వరకు, జిల్లా స్థాయిలో డిసెంబర్ 16 నుండి 21 వరకు, అలాగే రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ 27 నుండి జనవరి 2వ తేదీ వరకు క్రీడలు జరుగుతాయని తెలిపారు.