7 April, 2026 | 2:53 PM

అక్షరను అభినందించిన వివేక్

07-12-2024 11:56 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పొన్నారం గ్రామానికి చెందిన చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసు సావిత్రి-సంతోష్ కుమార్ దంపతుల కూతురు పట్టణంలోని మహత్మ జ్యోతిబా పులే పాఠశాల 9వ తరగతి విద్యార్థిని అక్షర ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. జాతీయ జట్టుకు ఎంపికైన అక్షరను చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు శనివారం ప్రత్యేకంగా అభినందించారు. పొన్నారం పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ జట్టుకు ఎంపికైన విషయాన్ని తెలుసుకొని స్వయంగా విద్యార్థిని ఇంటికి చేరుకొని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.