calender_icon.png 20 December, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరం

20-12-2025 12:32:29 AM

ఎమ్మెల్యే పాయలు శంకర్

ఆదిలాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాం తి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువు ఎంత ముఖ్యమో క్రీడలు సైతం అంతే ముఖ్యమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అనే పేరును రూపుమాపాలని, ఆ దిశగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్‌లోని బంగారిగూడ మైనార్టీ పాఠశాల లో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా క్రీడా జ్యోతి నీ వెలిగించి పోటీలను ప్రారంభించారు.

అనంతరం వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... క్రీడల వల్ల గుర్తింపు తో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. గతంలో అన్ని రంగాల్లో వెనుకబ డిన జిల్లా అని పేరు ఉన్న ఆదిలాబాద్‌లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు పయనిస్తోందని, క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచి జిల్లా పేరును నలుమూలల చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లాలా మున్నా, శ్రీనివాస్,  రాజేశ్వర్, జోగు రవి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జాబడే రాష్ట్రపాల్ పాల్గొన్నారు.