20-12-2025 12:32:19 AM
* ఇంచార్జి కలెక్టర్ : గరిమా అగ్రవాల్ ఆదేశం
* వేములవాడ ఆలయాల విస్తరణ పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
వేములవాడ, డిసెంబర్ 19, (విజయ క్రాంతి) వేములవాడలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని మౌళిక సౌకర్యాలను సమయానికి సిద్ధం చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సమ్మక్కసారలమ్మ జాతర నేపథ్యంలో వేములవాడకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ, శ్రీ రాజ రాజేశ్వరస్వామి ఆల యం, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులు, భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దర్శన క్యూల నిర్వహణ, త్రాగునీటి సరఫరా,మరుగుదొడ్లు, విశ్రాంతి సదుపాయాలు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. ఆలయ విస్తరణ పనుల్లో జాప్యం లేకుండా వేగవంతం చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.అలాగే భీమేశ్వర ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి ప నులను పరిశీలించి, భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని అధికారులకు సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో ఆర్ అండ్ బీ సీఈ రాజేశ్వరరెడ్డి, ఈఈ నర సింహాచారి, డీఈ శాంతయ్య, వీటీఏడీఏ సెక్రటరీ అన్సార్, శ్రీ రాజ రాజేశ్వరస్వామి ఆలయ డీఈ రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.