calender_icon.png 20 December, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి జూపల్లిని కలిసిన ఉమ్మడి జిల్లా నేతలు

20-12-2025 12:33:50 AM

ఆదిలాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాం తి): ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి  జూపల్లి కృష్ణారావు ని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు కలిసారు. హైదరాబాదులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, డీసీసీ అద్యక్షులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, డా. నరేష్ జాదవ్ తదితరులు మంత్రిని కలిసి పూలబోకేను అందించారు.

ఈ సందర్భంగా ఇటీవల జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల గెలుపోటములు గురించి చర్చించి, జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను అడి గి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రె స్ పార్టీ  చేపట్టే కార్యక్రమాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీహరి రావు, ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్చార్జ్ శ్యాం నాయక్, రాష్ట్ర డెయిరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి తదితరులు ఉన్నారు.