20-12-2025 12:49:18 AM
ముకరంపుర, డిసెంబరు 19 (విజయ క్రాంతి): కొత్తపల్లి లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఇమ్మెన్స్ పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి తో వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశ నుండి నైతిక విలువల పట్ల అవగాహన కల్పించాలని, చదువులో విజయం సాధించడం ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కాకుండా అత్యుత్తమ జీవితాన్ని అందుకోగలుగుతారని అన్నారు.
నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు చక్కటి ప్రణాళికలను రూపొందించి వ్యూ హాత్మకంగా వ్యవహరిస్తూ చదువులో రాణించి ఉత్తమ స్థానాలలో స్థిరపడాలని, తల్లిదండ్రుల ఆశాయలకు అనుగుణంగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.