calender_icon.png 20 December, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భర్త చేతిలో భార్య దారుణ హత్య

20-12-2025 12:48:45 AM

గద్వాల, డిసెంబర్19 : జీవితాంతం తోడుగా ఉండే వాడే కాలయముడయ్యాడు. చివరికి కట్టుకున్న భార్యను భర్త కడతేర్చిన సంఘటన ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ గోవిందుకు అదే గ్రామానికి చెందిన కురువ జమ్ములమ్మ (26)తో రెండో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కలరు.

గురువారం రాత్రి భార్యా భర్తలిద్దరు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గోవిందు తన భార్యను కర్రతో గట్టిగా కొట్టడంతో ఇంటి పక్కన ఉన్న వారు ఏమి జరిగిందో ఇంటి తలుపులు తీయగా తీవ్ర గాయలతో బాధితురాలు పరుగులు తీసింది. దీంతో భర్త, భార్యను నడి రోడ్డులో దారుణంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దాడిలో కుమారుడుకు గాయలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ధరూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

నిందితుడు గతంలో కూడా తల్లిదండ్రులపై దాడికి పాల్పడిన కేసులో జైళ్లు శిక్ష అనుభవించాడని, కొంతకాలం హైదరబాద్ ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతదేహాన్ని గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ధరూర్ ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు.