25-05-2025 11:03:26 PM
నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్(Nagarkurnool) మండలం తూడుకుర్తి ప్రభుత్వ పాఠశాల 1987-88 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 37 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులను సన్మానించి, పాత తరగతిలో కూర్చుని మధుర క్షణాలను పునర్వినిపించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ రెడ్డి, ఉత్తం రెడ్డి, శైలజ, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.