13 July, 2026 | 9:40 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అమర్‌నాథ్

04-02-2026 01:11 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 3: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలాక్సీ క్రికెట్ క్లబ్‌కు చెందిన అమర్‌నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు అంబుడ్స్‌మన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2023లో జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఫోర్జరీ పత్రాలతో జగన్‌మోహన్ రావు పోటీ చేశారని అమర్‌నాథ్ దాఖలు చేసిన ఫిర్యాదుపై అంబుడ్స్‌మన్ జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సంస్థ కార్యకలాపాలు ఆగిపోకూడదనే ఉద్దేశంతో, రన్నరప్‌గా నిలిచి 62 ఓట్లు సాధించిన అమర్‌నాథ్ ను అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నట్లు జస్టిస్ కైత్ తెలిపారు. అమర్నాథ్ వారం రోజుల్లోగా బాధ్యతలు స్వీకరించాలని, మిగిలిన తొమ్మిది నెలల కాలానికి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతారని ఆదేశించారు.