13 July, 2026 | 9:40 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

కమిందు మెండిస్‌కు పిలుపు

04-02-2026 01:14 AM

వరల్డ్‌కప్‌కు శ్రీలంక జట్టు ప్రకటన

కొలంబో, ఫిబ్రవరి 3: టీ20 వరల్డ్‌కప్ 2026కి ముం దు శ్రీలంక జట్టు కీలక నిర్ణ యం తీసుకుంది. అన్ని జట్ల కంటే ఆలస్యంగా స్క్వాడ్‌ను ప్రకటించిన శ్రీలంక.. జట్టులోకి కమిందు మెండిస్‌ను మళ్లీ తీసుకుంటూ, కీలక ఆటగాడు ధనంజయ డిసిల్వా ను తప్పించింది. ఇటీవల కాలంలో టీ20 ఫార్మాట్‌లో కమిందు మెండిస్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా సెలెక్టర్లు అత ని అనుభవం, మిడిలార్డర్‌లో నిలకడగా ఆడే సామర్థ్యంపై నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పటివరకు 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 540 పరుగులు చేసిన కమిందు, ఈసారి ప్రపంచ కప్‌లో కీలక పాత్ర పోషిస్తాడని జట్టు యాజమాన్యం భావిస్తోంది. మరోవైపు ధనంజయ డిసిల్వా ఇటీవల సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

టోర్నమెంట్‌లో శ్రీలంక జట్టుకు డాసున్ శనక కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.  బ్యాటింగ్ విభాగంలో పా తుమ్ నిస్సాంక, కుశాల్ మెం డిస్, చరిత అసలంక, కుశాల్ పెరెరా వంటి అనుభవజ్ఞులతో జట్టు బలంగా కనిపిస్తోంది. యువ ఆటగాడు పవన్ రత్నాయకే కూడా ఈసారి జట్టులో చోటు సంపాదించా డు. బౌలింగ్ విభాగంలో వనిందు హసరంగ, మహీష్ తీక్షణ స్పిన్ దళానికి నాయక త్వం వహిస్తుండగా, పేస్ విభాగంలో దుష్మం త చమీర, మతీష పథిరాన కీలక పాత్ర పోషించనున్నారు. గ్రూప్ బీలో ఆస్ట్రేలియా, ఐర్లాం డ్, ఒమాన్, జింబాబ్వే జట్లతో పోటీపడుతారు.