14-07-2025 11:12:05 AM
బెంగళూరు: చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి బి. సరోజా దేవి(B Saroja Devi Passed Away) సోమవారం కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. బెంగళూరులోని తన నివాసంలో బి. సరోజాదేవి తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళం సినిమాల్లో సరోజాదేవి నటించారు. ఆమె పలు భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించారు. బి. సరోజాదేవి( Saroja Devi) 1969లో పద్మశ్రీ పురస్కారం, 1992లో పద్మభూషన్ పురస్కారం అందుకున్నారు. మహాకవి కాళిదాసకు జాతీయ అవార్డు కూడా ఆమె అందుకున్నారు. పాండురంగ మహాత్మ్యం సినిమాతో బి. సరోజాదేవి తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు.
1940 జనవరి 7న జరోజాదేవి బెంగళూరులో జన్మించారు. అలనాటి అగ్రహీరోలైన ఎన్టీఆర్(Nandamuri Taraka Rama Rao), ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీగణేశన్ తో సరోజాదేవి నటించారు. చిన్నతనంలోనే సరోజాదేవి శాస్త్రీయ సంగీతం, నృత్యం నేర్చుకున్నారు. మహాకవి కాళిదాసు చిత్రంలో విద్యాధరి పాత్రలో సరోజాదేవి నటించారు. 1957 లోనే భూకైలాస్ సినిమాలో ఆమె నటించారు. 1959లో ఏఎన్ఆర్ తో పెళ్లి సందడి సినిమాలో నటించారు. తెలుగులో సరోజాదేవి నటించిన చివరి చిత్రం సామ్రాట్ అశోక. ఏఎన్ఆర్ తో పెళ్లికానుక, ఆత్మబలం, అమర శిల్పి జక్కన్నలో ఆమె నటించారు. 1963లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో శ్రీకృష్ణార్జునయుద్ధంలో సరోజాదేవి నటించారు. ఎంజీఆర్ తో ఏకంగా 26 సినిమాలు చేసిన సరోజా దేవి రికార్డు సృష్టించారు. శివాజీ గణేషన్ తో శెభాష్ మీనా, పుది పరవై చిత్రాల్లో నటించి మెప్పించారు. సరోజాదేవి మృతి పట్లు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.