14-07-2025 10:22:44 AM
హైదరాబాద్: ప్రభుత్వ వసతిగృహం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. చౌటుప్పల్ మండలం(Choutuppal Mandal) తూప్రాన్‌పేట్ లోని జ్యోతిబాపులే హస్టల్(Jyotiba Phule Hostel)లో ఈ ఘటన జరిగింది. హస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి ఐదో తరగతి విద్యార్థిని కిందకు దూకింది. మహబూబ్ నగర్(Mahabubnagar District) జిల్లాకు చెందిన బాలిక సంధ్య నిన్ననే హాస్టల్ లో చేరింది. హాస్టల్ లో ఉండటం ఇష్టం లేక బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. హస్టల్ సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.