calender_icon.png 14 July, 2025 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలలకు బాంబు బెదిరింపులు

14-07-2025 11:21:50 AM

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని మూడు పాఠశాలలకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు(Bomb Threats) వచ్చాయి. దీనితో అత్యవసర సేవలను ప్రారంభించినట్లు ఢిల్లీ పోలీసు అధికారి తెలిపారు. ప్రశాంత్ విహార్, ద్వారక సెక్టార్ 16లోని సిఆర్‌పిఎఫ్ పాఠశాలల నుంచి, చాణక్యపురిలోని మరో పాఠశాల నుంచి ఉదయం 8 గంటల ప్రాంతంలో బాంబు బెదిరింపు కాల్స్(Bomb Threat Calls) వచ్చాయని ఆయన చెప్పారు. "వెంటనే పోలీసు బృందాలు పాఠశాల ఆవరణను తనిఖీ చేయడానికి రంగంలోకి దిగాయి" అని ఆయన చెప్పారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(Deputy Commissioner of Police) (ద్వారకా) అంకిత్ సింగ్ మాట్లాడుతూ.. "సోమవారం తెల్లవారుజామున, ద్వారకా నార్త్ పోలీస్ స్టేషన్‌కు(Dwarka North Police Station) సిఆర్‌పిఎఫ్ స్కూల్‌లో బాంబు బెదిరింపు సమాచారం అందింది. ఆ ప్రాంతాన్ని వెంటనే అప్రమత్తం చేశామన్నారు. స్థానిక పోలీసులు, స్నిఫర్ డాగ్‌లు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లు పాఠశాలకు చేరుకుని తగిన తనిఖీలు నిర్వహించాయి" అని డిప్యూటీ కమిషనర్(Deputy Commissioner) అన్నారు. ఈమెయిల్ మూలాన్ని సైబర్ పోలీసు నిపుణులు నిర్ధారిస్తున్నారని తెలిపారు. పాఠశాలలో భద్రతను కట్టుదిట్టం చేశామని, ఇప్పటివరకు అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదని డీసీపీ వెల్లడించారు.