calender_icon.png 14 July, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో ఎక్సుజ్ టాస్క్‌ఫోర్స్ దాడులు

14-07-2025 02:06:32 AM

- కల్తీ కల్లు అనుమానంతో శాంపిల్స్ సేకరణ 

- సిద్ధిక్ నగర్‌లో అనుమతి లేని దుకాణం సీజ్

- కేసు నమోదు చేసిన అధికారులు

హైదరాబాద్, సిటీబ్యూరో జూలై 13 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో కల్తీ కల్లు, అక్రమ విక్రయాలపై ఎక్సుజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వ హించారు. ఎక్సుజ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సు జ్ శాఖ కమిషనర్ హరికిరణ్ ఆదేశాలతో ఎన్‌ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రణ వి పర్యవేక్షణలో స్టేట్ టాస్క్‌ఫోర్స్ బృం దాలు  నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ దాడు ల్లో కల్తీ అనుమానంతో కల్లు నమూనాలను సేకరించడంతో పాటు, అనుమతి లేకుండా నడు పుతున్న ఓ దుకాణాన్ని సీజ్ చేశాయి.

ఎస్‌టీఎఫ్ ఏ-టీమ్ లీడర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలోని బృందం శేరిలింగంపల్లి, సిద్ధిక్ నగర్ ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్లపై దాడులు చేసింది. లైసెన్సులు ఉన్న దుకాణాల నుంచి కల్లు శాంపిళ్లను సేకరించారు. ఈ క్రమంలో సిద్ధిక్ నగర్‌లో ఎలాంటి అనుమతి లేకుండా నడుపుతున్న కల్లు దుకాణాన్ని గుర్తించి, దానిని సీజ్ చేశారు. దుకాణ యజమానిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

పలుచోట్ల శాంపిళ్ల సేకరణ

మరో రెండు ఎస్‌టీఎఫ్ బృందాలు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీ లు చేపట్టాయి. ఎస్‌టీఎఫ్ సీఐ వెంకటేశ్వర్లు బృందం బాలానగర్, మూసాపే ట్, కైతలాపూర్ ప్రాంతాల్లోని కల్లు డిపో లు, కాంపౌండ్లను తనిఖీ చేసి, నమూనాలను సేకరించి స్థానిక ఎక్సుజ్ సీఐలకు అప్పగించారు. ఎస్‌టీఎఫ్ సీఐ నాగరాజు బృందం ముషీరాబాద్, కా చిగూడ సర్కి ళ్ల పరిధిలోని పలు కల్లు డిపోలు, దుకాణాలను పరిశీలించి శాంపిళ్లను సేకరిం చారు. సేకరించిన కల్లు నమూనాలను ల్యాబొరేటరీకి పంపినట్లు ఎక్సుజ్ అధికారులు వెల్లడించారు. ల్యాబ్ నివేదికల ఆ ధారంగా కల్తీకి పాల్పడిన వారిపె చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.