calender_icon.png 14 July, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు

14-07-2025 10:45:41 AM

  1. రూ.1, 36,750/- ల నగదు 
  2. 45 బైకులు, 67 సెల్ ఫోన్లు సీజ్..
  3. -హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు

హుజూర్ నగర్ : పేకాట కోడి పందాలు ఆడితే కఠిన చర్యలు తప్పవు అని హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు తీవ్రంగా హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని సీఐ కార్యాలయంలో సర్కిల్ పరిధిలోని నెలవారి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గత ఆరు నెలల్లో 19 కేసులు కోడి పందాలు,పేకాట రాయుళ్లపై కేసులు నమోదు చేసి తహసిల్దార్ వద్ద బైండోవర్ చేశామన్నారు.

హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు,గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 7 కేసులు,నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, మఠంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, పాలకీడు పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు నమోదు చేసి 137 మంది నేరస్తులను అరెస్టు చేసి వారిని బైండోవర్ చేశామని నేరస్తుల నుండి రూ.1, 36,750/- లను,45 బైకులను,67 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని కోర్టు హాజరు పరిచామన్నారు. గ్రామాలలో,పట్టణాలలో, ఫామ్ హౌస్ లలో,ఇళ్ళల్లో, బహిరంగ ప్రదేశాల్లో పేకాట, కోడి పందాలు మరే ఇతర చట్టవ్యతిరేకమైనకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలుతీసుకుంటామని హెచ్చరించారు.ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు లేదా 100 డయల్ కు సమాచారం అందించాలని సూచించారు.సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.