17 April, 2026 | 4:01 PM

అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్ట పనులు ప్రారంభం

08-12-2024 03:57 PM

కాప్రా,(విజయక్రాంతి): కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చర్లపల్లి చౌరస్తాలో చర్లపల్లి మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్ట పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ వచ్చే అంబేద్కర్ జయంతి వరకు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాంల ఆశయ సాధన కోసం అన్ని వర్గాల వారు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు కడియాల జనార్ధన్, కడియాల యాదగిరి,  కొమ్ము నర్సింగరావు, డప్పు గిరిబాబు, కొమ్ము రమేష్, కడియాల కుమార్, కడియాల నగేష్, కొమ్ము సురేష్, కడియాల సురేష్, పి. శ్రీనివాస్, భరత్ రాజ్ నందకిషోర్ గణేష్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.