calender_icon.png 7 October, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ జీవితచరిత్ర నాటకం కరపత్రిక ఆవిష్కరణ

07-10-2025 12:26:06 AM

ఘట్ కేసర్, అక్టోబర్ 6, (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో  అంబేద్కర్ జీవిత చరిత్ర నాటకం కరపత్రాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహం ఆవరణలో జరిగిన కార్య క్రమంలో ఘట్ కేసర్ రైతు సేవా సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి చేతుల మీదుగా కరపత్రాన్ని ఆవిష్కరించారు.

షేడ్ స్వచ్చంధ సేవా సంస్థ 25 సంవత్సరాల (సిల్వర్ జూబ్లీ) సందర్భంగా ఈనెల 12న ఘట్ కేసర్ పాత మున్సిపల్ కార్యాలయo ఆవరణలోని మండపంలో సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ అభ్యుదయ ఆరట్స్ అకాడమీ వారితో ‘సంఘం చరణం గచ్చామీ‘ అంబేద్కర్ జీవిత చరిత్ర సాధించిన లక్ష్యాలపై పూర్తి చరిత్ర నాటకం ప్రదర్శించడం జరుగుతుందని అందరూ పాల్గొనాలని నిర్వహకులు- షెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కడప ఈశ్వర్ తెలిపారు.

ఈకార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాసు, మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేశతో పాటు అంబేద్కర్ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.