calender_icon.png 7 October, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టికెట్ ఆర్టీసీది.. ప్రమాదం జరిగితే ప్రైవేటుదా?

07-10-2025 12:27:14 AM

- మాకేం సంబంధం అంటూ ఆర్టీసీ దాటవేత

- డీఎం నిర్లక్ష్యంపై డిపో ముందు నిరసనగళం 

కల్వకుర్తి రూరల్ అక్టోబర్ 06:ప్రయాణికురాలికి గాయాలైన ఘటనలో ఆర్టీసీ అధి కారి బాధ్యతారహితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కల్వకుర్తి బస్ డిపో మేనేజ్ప చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయా ప్రజా సంఘాలు సోమవారం సాయంత్రం కల్వకుర్తి డిపో ఎదుట చేపట్టాయి. ఆర్టీసీ పేరుతో నడుస్తున్న ప్రైవేట్ బస్సులో ప్రమా దం జరిగితే, అది తమ పరిధిలోకి రాదం టూ చెప్పడంతో బాధితులు, ప్రజా సంఘా ల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే...గత నెల 29న సంతోష్ నగర్ నుంచి బయలుదేరిన బస్సును ఆమనగల్ శివారులో వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్ర యాణిస్తున్న కల్వకుర్తి పట్టణానికి చెందిన సరస్వతి అనే మహిళా ప్రయాణికురాలికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ విషయాన్ని కల్వకుర్తి డిపో మేనేజర్ సుభాషిణి దృష్టికి తీసు కెళ్లగా, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయమన్నారు కానీ వారం రోజుల తర్వాత స్పందించిన డీఎం అది ప్రైవేట్ బస్సు ఆర్టీసీకి ఎ లాంటి సంబంధం లేదని ఏమైనా ఉంటే బస్సు యజమానితోనే మాట్లాడుకోవాలని దురుసుగా సమాధానమిచ్చారని బాధితురాలి భర్త రమేష్ ఆరోపిస్తున్నారు. ప్రయాణి కుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, ఆర్టీసీ పేరుతో ప్రైవేటు యాజమాన్యాలకు మేలు చేస్తున్నారని ఆరోపిస్తూ డీఎంపై చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజా సం ఘా లు, కుల సంఘాలు, బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం క ల్వకుర్తి ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేపట్టా రు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు, బాధ్యులైన అధికారిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.

వివాదాలకు కేరాఫ్ కల్వకుర్తి డిపో. 

బాధ్యత గల హోదాలో ఉండి కూడా ప్ర యాణికుల సమస్యలను గాలికి వదిలేస్తూ, ప్రశ్నించిన వారిపై అధికార దర్పం ప్రదర్శిస్తున్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వ్య వహారశైలి పట్ల కల్వకుర్తి డిపో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని చర్చ నడుస్తోంది. ఏదైనా సమస్యపట్ల తన దృష్టికి తీ సుకొస్తే బాధ్యతగా వ్యవహరించాల్సిన డిఎం బాధితులపైనే కేసులు పెట్టిస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు బాధితుల నుం డి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బస్టాండ్లో ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ వైర్ల సమస్యను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అతనికి ఫోన్ చేసి ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ ఆఫీసుకు వచ్చి కలవాలని హు కుం జారీ చేసినట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు.

అంతేకాకుండా, పట్టణానికి చెందిన ఓ యువకుడు లగేజ్ టికెట్ విషయంలో డీ ఎంను సంప్రదించగా, అతని పట్ల కూడా దురుసుగా ప్రవర్తించి, పోలీసులను పిలిపిం చి బయటకు పంపించిన ఘటనలున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. డిపో లో డీజిల్ గోల్మాల్ జరుగుతోందన్న ఆరోపణలు సైతం బలంగా వినిపిస్తున్నప్పటికీ, ఫి ర్యాదు చేసేందుకు ఎవరూ సాహసించకపోవడంతో ఆ లెక్కలు బయటకు రావడం లేద ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆర్టీసీ ఉన్న తాధికారులు కల్వకుర్తి డీఎంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారిణి వైఖరిపై ప్రజ ల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, ఉన్నతాధికారుల మౌనం వెనుక ఆంతర్యమే మిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై కల్వకుర్తి డిపో మేనేజర్ సుభాషిని ఫోన్ లైన్ లో సంప్రదించగా అందుబాటులోకి రాకపోవడంకొసమెరుపు.