calender_icon.png 7 October, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నోటీసులు సరే.. ఇంతవరకు చర్యలేవి మరీ?

07-10-2025 12:25:15 AM

- ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం !

- మండి పడ్డ ప్రజాసంఘాల నాయకులు 

అలంపూర్, అక్టోబర్, 06:గద్వాల జిల్లా మానవపాడు మండలం కొర్విపాడు గ్రామానికి చెందిన హీరాబాయి నిర్దిష్ట కాల పరి మితితో తాత్కాలిక రేషన్ డీలర్ గా కొనసాగుతూ ... కొత్త రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పి గ్రామస్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనపై గత నెల ప్రజావాణి లో ఫిర్యాదు చేసిన అధికారులు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ప్రజాసంఘాల నాయకు లు మండిపడ్డారు.గ్రామానికి చెందిన కొంతమంది అర్హులకు ఇటీవల కొత్త రేషన్ కార్డు లు మంజూరు చేయగా వాటిని లబ్ధిదారులకు ఇచ్చేందుకు డీలర్ డబ్బులు వసూలు చేశారని తెలిపారు.

అయితే ఇదే విషయమై గత జులై నెలలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గ్రామంలో పర్యటించి విచారించారు. ఒక్కొక్కరితో రూ.100 నుంచి రూ.150 రూపాయలు వసూలు చేశారని అలా మొ త్తం 26 మందితో తీసుకున్నట్లు అధికారులు గుర్తించి తహసిల్దార్ జోషీ శ్రీనివాస్ శర్మకు నివేదికను అందజేశారు. అప్పటి ఆర్డీవో డీల ర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసి నెలలు గడుస్తున్న ఇంతవరకు డీలర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.ఈ మేరకు మరోసారి సోమవారం గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు మానవపాడు తాహసిల్దార్ జోషి శ్రీనివాస శర్మను కలిసి డీలర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడగగా...ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ ఉన్నందున ఆలస్యమైందని త్వరలోనే చర్యలు తీసుకుంటామని తాహాసిల్దార్ చెప్పినట్లు తెలిపారు.

డీలర్ డబ్బుల వసూలుపై ఆర్డీవో మేడంను ఫోన్ లో సంప్రదిస్తే .. డీలర్ ను తొలగించే అధికారం మాకు ఉండదు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు ప్రజాల సంఘాల వారు అన్నా రు. అయితే తాత్కాలిక రేషన్ డీలర్ కాల పరిమితితో నియమించి గడువు తీరిపోయిన ఇంకా కొనసాగుతున్నడం వెనక ఏదైనా రాజకీయ ప్రమేయం ఉన్నదా? అని వారు మండిపడ్డారు.డబ్బుల వసూలు ఆరోపణలు ఉన్న డీలర్ ను తొలగించి పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకు అవకాశం కల్పించాలని వారు ఈ సందర్భంగా డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు హుస్సేన్, రుక్మత్ భాష, ఎమ్మార్పీఎస్ నా యకులు జయరాజు ,శ్రీను, కెవిపిఎస్ మధు, శాంతిరాజు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.