calender_icon.png 6 December, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయి ఈశ్వర్ చారికి బీసీ జేఏసీ నాయకుల ఘన నివాళులు

06-12-2025 03:14:58 PM

కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద సాయి ఈశ్వర చారికి బీసీ జేఏసీ నాయకుల ఘన నివాళులు అర్పించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రావేమో అని మనోవేదనకు గురై ఆత్మహుతి చేసుకొని అమరుడైన సాయి ఈశ్వర చారికి బీసీ జేఏసీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. శ్రీధర్ రాజ్ మాట్లాడుతూ... ఇది ముమ్మాటికి ప్రభుత్వం హత్యే అని ఆ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, అలాగే సాయి ఈశ్వర్ చారి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నాగుల కనుకయ్య గౌడ్ మాట్లాడుతూ, కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి బీసీలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం పట్ల బీసీ సంఘాలు,కుల సంఘాలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నామన్నారు.ఆది మల్లేశం పటేల్ మాట్లాడుతూ,ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు పోతామని దేశంలో తెలంగాణ రోల్ మాడల్ అని వారు ఇచ్చిన మాట కట్టుబడకుండానే ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అన్నారు.

తక్షణమే ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకొని 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బొల్లం లింగమూర్తి మాట్లాడుతూ,ఆరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల  బిసి సమాజం మొత్తం  కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేదన్నారు. నర్సింగోజు శ్రీనివాస చారి మాట్లాడుతూ,ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే బీసీలకి 42శాతం రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచే విధంగా బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రస్తావన చేసి రాజ్యాంగ సవరణ ద్వారా 9th షెడ్యూల్లో చేర్చి బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు అమలయ్యే విధంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకొని తమ పార్టీ విశ్వసనీయతను,చిత్తశుద్ధిని చాటుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

లేనిపక్షంలో బీసీ సంఘాలు,కుల సంఘాలు ముక్తకంఠంతో రాబోవు రోజులలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఎక్కడిక్కక్కడ అడ్డుకుంటామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అయినా సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బొల్లం లింగమూర్తి, కేసిపెద్ది శ్రీధర్ రాజు, ఆది మల్లేశం పటేల్, నాగుల కనకయ్య గౌడ్, నర్సింగోజు శ్రీనివాస్ చారి, నారోజు రాకేష్ చారి, దొగ్గలి శ్రీధర్, నల్లగొని శ్రీనివాస్, లింగంపల్లి శ్రీనివాస్, ఉమామహేశ్వర్, దేవరకొండ సంతోషిని, బిసి సంఘాలు, కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.