13-05-2025 12:00:00 AM
బెల్లంపల్లి అర్బన్, మే 12: ప్రపంచానికి అంబేద్కర్ ఆలోచన విధానం చుక్కాని అని, అంబేద్కర్ ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ అని జిల్లా ఇన్ చార్జ్ మంత్రి సీతక్క కొనియాడారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చాకపల్లి గ్రామంలో సోమవారం రూ. 17 కోట్లతో నిర్మించిన మండల రహదారులు, రూ. 2.45 కోట్లతో బెల్లంపల్లి నుంచి చాకపల్లి వరకు నిర్మించ తలపెట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామితో కలిసి శంకుస్థాపన చేశారు.
గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ ముడిమడుగుల శంకర్ చాకపల్లి గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బెల్లంపల్లి ఎమ్మె ల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దండే విట్టల్‌తో కలిసి ఆవిష్క రించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగ పీఠికతో అణగారిన బడుగు బలహీన దళిత వర్గాలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారన్నారు.
అంబేద్కర్ లేకపోతే దళిత గిరిజన ప్రజలకు బతుకు లేదన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం పుణ్యమే చాయివాలా మోడీ దేశానికి ప్రధాని అయ్యాడని పేర్కొన్నారు. గుజరాత్ కు మూడుసార్లు సీఎం అయ్యాడని గుర్తు చేశారు. అలాంటిది అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం పార్లమెంటులో అంబేద్కర్ ను హేళన చేశాడని విమర్శించారు.
అంబేద్కర్ ఆలోచన విధానాన్నీ, తను రాసిన రాజ్యాంగాన్ని పాలకులు జీర్ణించుకోవడంలేదని అన్నారు. రా జ్యాంగాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మహనీయుల స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పాల న్నారు. ప్రతి ఇంటిలో అంబేద్కర్ ప్రతిభను ఏర్పాటు చేసుకొని గౌరవించాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ ముడిమడు గుల శంకర్ చాకపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం అభినందనీయమ న్నారు.
ఇంజనీర్ శంకర్ ను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో వెళితే ప్రతి ఒక్కరరూ ఉన్నతమైన అభివృద్ధిని సాధిస్తారన్నారు. చదువు తోటే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతారని గుర్తు చేశారు. అంబేద్కర్ ను అంటరానిగా చూసినా ఆ సమాజంలో ఎంతో కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగాడన్నారు. అంతేకాదు ప్రపంచంలో గర్వించదగిన ప్రజాస్వామ్యానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించాడ న్నారు.
చదువు వల్లనే అంబేద్కర్ ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా నిలిచాడన్నారు. అంట రానితనాన్ని నిర్మూలించడానికి అంబేద్కర్ విశేషంగా కృషి చేశాడన్నారు. రాజ్యాంగం లేకముందు అనగారిన ప్రజలకు హక్కులు ఉండే వి కాదన్నారు. అంటరాని వారిగా అణచివేత గురయ్యారన్నారు. అణగారిన ప్రజలకు దళితులకు గిరిజనులకు ఆత్మగౌరవం అంబేద్కర్ రాజ్యాంగం తోటి అందించాడన్నారు. ప్రపంచంలో అంబేద్కర్ గొప్పదార్శ నీకుడని ప్రశం సించారు.
ఈ కార్యక్రమాలలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఎమ్మెల్సీ దండే విటల్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డిసిపి భాస్కర్, గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ ముడిమడుగుల శంకర్, టీసీసీపీ రాష్ర్ట ప్రచార కన్వీనర్ నాతరి స్వామి, టీసీసీపీ సభ్యులు చిలుముల శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మునీమంద రమేష్, మాజీ ఎమ్మెల్యే సక్కు, ఆసిఫాబాద్ డిసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బొర్లకుంట పోచలింగం, ఉపాధ్యాయురాలు, వ్యాఖ్యాత ఎర్ర సువర్ణ తదితరులు పాల్గొన్నారు.