12-05-2025 11:32:51 PM
నిర్మల్,(విజయక్రాంతి): టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన ముగ్గురు హాస్టల్ వార్డెన్లు సోమవారం విధుల్లో చేరినట్టు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం బీసీ సంక్షేమ శాఖ బీసీ హాస్టల్ సంక్షేమ అధికారుల ఉద్యోగాల నియామక ప్రక్రియ టీజీపీఎస్ ద్వారా నిర్వహించగా జిల్లాకు ముగ్గురిని కేటాయించినట్లు తెలిపారు. లోకేశ్వరం బీసీ హాస్టల్ సంక్షేమ శాఖ అధికారిగా శ్రీధర్ లింగాపూర్ సంక్షేమ శాఖ అధికారిగా లావణ్య లక్ష్మణ చందా సంక్షేమ శాఖ అధికారిగా ఇస్మాయిల్ ను నియమించడంతో వారు వెంటనే వీధిలో చేరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ డివిజన్ అధికారి సత్యనారాయణ రెడ్డి పరిపాలన కాలిద్ హమ్మద్ ఉద్యోగులు ఉన్నారు.