28 June, 2026 | 12:13 PM

Breaking News

రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •  

విజయ క్రాంతి ప్రజల గొంతుకగా నిలుస్తోంది

18-04-2026 04:41 PM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విజయ క్రాంతి దినపత్రిక ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను వెలుగులోకి తీసుకువస్తుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. పత్రిక వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఆమె నివాసంలో స్టాఫ్ రిపోర్టర్ చిప్ప సురేష్, కౌన్సిలర్ చిలువేరు వెంకటేశ్వర్లు, రిపోర్టర్ శ్రీనివాస్‌లతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయ క్రాంతి పత్రిక ఆవిర్భవించిన తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందిందన్నారు.

అవినీతి ఆరోపణలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తూ పత్రిక తన విశ్వసనీయతను నిలబెట్టుకుంటోందని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సంబంధించిన వార్తలను ప్రచురిస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని అభినందించారు.ఈ సందర్భంగా పత్రిక యాజమాన్యానికి, సిబ్బందికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీవన్, భీమేష్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.