calender_icon.png 5 November, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరికీ ఆదర్శప్రాయుడు అంబేద్కర్

01-07-2024 01:20:26 AM

  • భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 30 (విజయక్రాంతి): రాజ్యంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో వెంకట్రావ్‌పల్లి మాజీ సర్పంచ్ ఏకు మల్లేశ్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాల్యం నుంచి అన్ని రకాల వివక్షను ఎదుర్కుంటూనే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప వ్యక్తి అని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు.