calender_icon.png 5 November, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు నాణ్యమైన సేవలందించడమే ప్రధాన లక్ష్యం

05-11-2025 01:11:44 PM

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ పట్టణంలో కురిసిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ ఉన్నతాధికారులు, సంబంధిత శాఖలతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో వర్షపు నీరు చేరిన ప్రాంతాలను గుర్తించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నాణ్యమైన సేవలు అందించాలన్నారు. ఇకముందు ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకుని శాశ్వత మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టాలని సూచించారు.