calender_icon.png 5 November, 2025 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్తవ్యస్తంగా మారిన రోడ్లను ఇకనైనా బాగు చేయండి

05-11-2025 01:08:19 PM

రోడ్డుపై బైఠాయించి గ్రామస్తుల ఆందోళన

తాండూర్,(విజయక్రాంతి): చేవెళ్ల బస్సు ప్రమాదం తో నైనా అధికారులు, పాలకులు అప్రమత్తమయ్యి పాడైన రోడ్లను వెంటనే  నూతన రోడ్లను నిర్మించి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దూరం చేయాలంటూ వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం బుద్ధారం గ్రామ యువకులు,ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు మాట్లాడుతూ తాండూర్ నుండి పెద్దమున్ వరకు రోడ్డు అధ్వానంగా మారిందని పాలకులు, అధికారులు ఈ రోడ్డుపైనే ప్రయాణిస్తున్న కళ్ళు లేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడుతూ ఆరోపించారు.