calender_icon.png 5 November, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువుగట్టు ఆలయంలో తడి బట్టల దర్శనానికి అనుమతి కల్పించాలి

05-11-2025 01:15:58 PM

నిషా క్రాంతి జోగిని

నకిరేకల్,(విజయక్రాంతి): చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని తడి బట్టలతో స్నానం చేసి దర్శించుకోవడం వల్ల భక్తుల అనేక రోగాలు తీరుతాయని ప్రజల నమ్మకం ఉందని, ఆ ఆచారాన్ని కొనసాగించాలని నిషా క్రాంతి జోగిని విజ్ఞప్తి చేశారు.బుధవారంకార్తీక మాసం సందర్భంగా ఆలయాన్ని సందర్శించిన ఆమె, దేవస్థానంలో అభివృద్ధి లేమిపై ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచీ ఆలయానికి వస్తున్నానని, కానీ ఇప్పటికీ ఎలాంటి మార్పు జరగలేదని ఆమె తెలిపారు.గుట్టపైకి రాగానే ఎదురుగా ఉన్న మరుగుదొడ్లు భక్తుల పవిత్రతకు భంగం కలిగిస్తున్నాయని, అవి తొలగించి శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె కోరారు.అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తున్నా తాగునీరు, స్నానం, విశ్రాంతి వంటి సదుపాయాలు లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు.ప్రభుత్వం, దేవాదాయ శాఖ భక్తుల సౌకర్యాల పట్ల నిర్లక్ష్యం చూపడం తగదని విమర్శిస్తూ, చెరువుగట్టు ఆలయాన్ని తగిన రీతిలో అభివృద్ధి చేయాలని ఆమె డిమాండ్ చేశారు.