05-11-2025 01:00:26 PM
న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో భారతీయ మూలాలున్న మమ్‌దానీ విజయం
వాషింగ్టన్: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump)కు భారీ షాక్ తగిలింది. భారతీయ మూలాలున్న జొహ్రాన్ మమ్‌దానీ(Zohran Mamdani) న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించారు. వామపక్ష నేత జహ్రాన్ మమ్ దానీ న్యూయార్క్ మేయర్ గా ఎన్నికై ట్రంప్ కు ఊహించని ఎదురుదెబ్బ కొట్టాడు. మేయర్ పదవి చేపట్టిన తొలి ఇండియన్-అమెరికన్ ముస్లింగా జొహ్రాన్ మమ్‌దానీ(Indian-origin Zohran Mamdani) రికార్డు సృష్టించారు. జొహ్రాన్ మమ్ దానీ భారతీయ-ఉగాండా మూలాలున్నాయి. మమ్‌దానీ 34 ఏళ్లకే న్యూయార్క్ మేయర్ గా ఎన్నికయ్యారు. మమ్‌దానీ భారతీయ సినీ డైరెక్టర్ మీరానాయర్ కుమారుడు.
మమ్‌దానీ(Mamdani) విజయంతో అత్యంత కీలక మైన హామీ ఉచిత సిటీ బస్సు ప్రయాణాలు ప్రారంభం కానున్నాయి. జొహ్రాన్ మమ్‌దానీని ఓడించడానికి స్వయంగా ప్రెసిడెంట్ ట్రంప్(President Trump) రంగంలోకి దిగారు. మమ్ దానీని ఓడించేందుకు స్వయంగా ప్రచారం చేసిన ట్రంప్ విఫలమయ్యారు. అమెరికాలో ట్రంప్ విధానాలతో గవర్నర్, మేయర్ ఎన్నికల్లో ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. న్యూయార్క్ మేయర్(New York Mayor)గా గెలుపొందిన అనంతరం అమెరికా అధ్యక్షుడిని మమ్‌దానీ నేరుగా హెచ్చరించారు. ట్రంప్, మీరు ఇదంతా చూస్తున్నారని నాకు తెలుసు. మీకు చెప్పడానికి నా దగ్గర నాలుగు మాటలున్నాయి. మీరు మాలో ఎవరినైనా చేరుకోవాలంటే, మా అందరినీ దాటి రావాలంటూ మమ్‌దానీ సవాల్ విసిరారు.