14 April, 2026 | 6:58 PM

బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం అంబేద్కర్‌

14-04-2026 03:36 PM

చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండలంలోని అక్కలదేవిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అమరగాని ఆంజనేయులు ఆధ్వర్యంలో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబా సాహెబ్ డా. అంబేద్కర్‌ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ కొంగల అనూష రామలింగయ్య మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల హక్కుల సాధనకు అంబేద్కర్‌ చేసిన సేవలు అపారమని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు అమరగాని అబ్బులు గౌడ్,బెల్లంకొండ శ్రీరాములు, రాములు గౌడ్, కార్యదర్శి మల్లయ్య, హ్యూమన్ రైట్స్ మండల అధ్యక్షులు కొంగల సురేష్. వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.