గరిడేపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
* అంబేద్కర్ ఆలోచనలు ప్రపంచానికే ఆదర్శం
గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ తో పాటు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలను అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండలంలోని అనేక గ్రామాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద పలు యువజన సంఘాలు, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిషత్ అధికారి సరోజ, తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ స్రవంతి, పోలీస్ స్టేషన్లో ఎస్సై చలికంటి నరేష్, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రస్తుత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, సంఘాల సభ్యులు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు, వివిధ రాజకీయపార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






