14 April, 2026 | 8:13 PM

మంచరామిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 04:23 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  135వ జయంతి వేడుకలు  సర్పంచ్ ఉప్పు లక్ష్మీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉప్పు లక్ష్మీ మాట్లాడుతూ... అంబేద్కర్  ఆశయాలు సమాజ అభివృద్ధికి మార్గదర్శకమని, ఆయన చూపిన దారిలోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.