కుటుంబంపై దాడి.. నలుగురిపై కేసు నమోదు
28-08-2026 12:25 AM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి వద్ద కుటుంబ సభ్యులపై దాడి చేసిన ఘటనలో నలుగురు యువకులపై కేసు నమోదు చేశారు. బాధితుడు కంకణాల రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో గాయపడిన వారు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ ఘటనపై తంగళ్లపల్లి ఎస్సై సిరిసిల్ల అశోక్ వివరాలు తెలిపారు.






