14 April, 2026 | 10:33 PM

అంబేద్కర్ కు పలువురు ఘన నివాళి

14-04-2026 06:29 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, దళిత అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారి దయానంద్ తో పాటు దళిత సంఘాల నాయకులు వైద్యులు యువజన సంఘాల సభ్యులు, బిజెపి టిఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించాయి.

పట్టణంలోని గొల్లపేట్ గాజులపేట్ నాయుడు వాడ రైతుల కాలనీలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తపస్సు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు శశిరాజ్ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ నివాళులు అర్పించగా. వైద్యులు చక్రధరి రమేష్ సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాజుల రవి గణేష్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మార్కొండ రాముతదితరులు ఉన్నారు