ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి
మేడ్చల్, ఏప్రిల్ 14(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉప్పల్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదవ్, కీసర ఆర్డిఓ రాజేష్ కుమార్, ఏసీపి వెంకట్ రెడ్డి, స్థానిక తహసిల్దార్ పూల్ సింగ్, డి ఆర్ డి ఓ సాంబశివరావు, ఎల్ డిఎం శివప్రసాద్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి పద్మజ, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సిపి కార్యాలయంలో...
నేరేడుమెట్లోని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అడ్మిన్ డిసిపి ఇందిరా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.






